ప్రజాశక్తి -నెల్లూరు అర్బన్ : ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పాండిచ్చేరి లోని శెన్ బాగ హోటల్ న్వెన్షన్ సెంటర్‌లో జాతీయ స్థాయిలో ఉత్తమ సేవలందించిన సమాజ సేవకులకు జీవిత సాఫల్య పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, సమాజసేవకులు, రచయిత కె.మురళీమోహన్ రాజు చేస్తున్న సేవల్ని గుర్తిస్తూ ''జీవిత సాపల్య పురస్కారం'' పాండిచ్చేరి కేంద్ర కారాగారం జైలు సూపరెండెంట్ వి.భాస్కరన్ చేతుల మీదుగా మురళీమోహన్ రాజు అందుకున్నారు. కన్నడ ఫిల్మ్ డైరెక్టర్,రైటర్ డాక్టర్ గుణవంత మంజు, సేంద్రియ వ్యవసాయ మోటివేటర్ స్పీకర్ సి.రాజేంద్రన్, కర్ణాటక స్వచ్చంద సేవకులు శిలాజ జీవనందన్, ప్రముఖులు టి.షీతలాదేవి, పి.బాలగంగాధరన్, రాజా వేణుగోపాల్, వివిధ రాష్ట్రాల సమాజ సేవకులు ఉన్నారు.










