ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
ఆకివీడులో ఆదివారం జరిగిన అంతర్జాతీయ లయన్స్ క్లబ్ 316జి జిల్లా రీజన్ నాలుగు మీట్‌లో తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ అడ్మిన్ లయన్ పేరిచర్ల మురళీ కృష్ణంరాజు బెస్ట్ యాక్టివ్ లయన్ అవార్డు అందుకున్నారు. రీజనల్ ఛైర్ పర్సన్ లయన్ ఆర్‌విఎస్ సూర్య నారాయణరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కెనరా బ్యాంక్ ఎమ్‌డి, సిఇఒ సత్యనారాయణరాజు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ లయన్ పంక జాక్షన్, లయన్ గట్టిం మాణిక్యాలరావు, లయన్ కాకర్ల వేణుబాబు, సిహెచ్ కృష్ణంరాజు పాల్గొన్నారు. బ్యానర్ ప్రజంటేషన్‌లో 3వ బహుమతి డైమండ్స్ లయన్స్ క్లబ్‌కు, ఉత్తమ క్లబ్స్ బెస్ట్ ప్రెసిడెంట్స్ అవార్డు లయన్ కోనా హనుమాన్‌ను వరించాయి. వారిని పలువురు అభినందించారు.










