'మునస్వామి'కి జాతీయ బంగారు నంది అవార్డు
ప్రజాశక్తి - కార్వేటినగరం: ఎక దాటిగా 20 సంవత్సరాలు సర్పంచ్‌గా పంచాయతీ అభివద్ధికి కషిచేసి పలు అభివద్ధి పనులు చేపట్టిన మునస్వామికి జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ వారు ఉత్తమసేవా పౌరుడిగా జాతీయ బంగారు నంది అవార్డును మాజీమంత్రి వేణుగోపాల ఆచారీ ఆధ్వర్యంలో వల్లూరి ఫౌండేషన్ అధ్యక్షులు వీ.ఆర్ శ్రీనివాసరాజు సోమవారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో 2023కి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ సర్పంచ్ బంగారు నంది అవార్డు గ్రహీత మునస్వామి మంగళవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను సర్పంచ్‌గా పంచాయతీకి 20 సంవత్సరాలు అందించిన సేవలకు వల్లూరి పొండేషన్ సంస్థ గుర్తించి జాతీయ నంది అవార్డును అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆయన్ను పలువురు నాయకులు, అధికారులు దుకాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సినీ హాస్యనటులు రఘు, రాజన్ పలువురు పాల్గొన్నారు.
అవార్డును అందుకుంటున్న మాజీ సర్పంచ్ మునస్వామి










