ప్రజాశక్తి-పుత్తూరుటౌన్:
మొదట పార్కులోని వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా గతంలో ఫారెస్ట్ అధికారులు స్వాధీనంలో ఉన్నటువంటి స్థలాన్ని స్వాధీనం చేసుకుని తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారితో రూ. కోటి 10 లక్షలు మంజూరు చేయించుకోని పార్కు తీర్చిదిద్ది ప్రారంభించామన్నారు. పార్క్‌లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడుతూ తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అడిగిన వెంటనే నిధులు ఇప్పించడం వల్లనే ఇది సాధ్యమైందని చెవిరెడ్డికి ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు పురపాలక సంఘం చైర్మన్, వైస్‌చైర్మన్‌లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కుమారస్వామిరెడ్డి పాల్గొన్నారు.










