Mar 18,2022 15:23

ప్రజాశక్తి-పుత్తూరు టౌన్ : చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణంలోని మున్సిపల్ ప్రజల చిరకాల వాంఛ ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉండేందుకు మున్సిపల్ పార్కు ఉండాలని ఎమ్మెల్యే రోజా సెల్వమణి చేతుల మీదుగా పార్కును ప్రారంభించారు. పార్కులోని వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి. ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా గతంలో ఫారెస్ట్ అధికారులు స్వాధీనంలో ఉన్నటువంటి స్థలాన్ని స్వాధీనం చేసుకుని తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారితో రూ కోటి పది లక్షలు మంజూరు చేయించి పార్కు నిర్మించి ఈరోజు ప్రారంభించారు. ఇదే కార్యక్రమంలో మున్సిపల్ పార్క్ మధ్యలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి శిలా విగ్రహాన్ని ఆవిష్కరించారు. పార్క్ లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. ఎమ్మేల్యే గారు మాట్లాడుతూ తుడ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేయడంతో ఇది సాధ్యమైందని, ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పుత్తూరు పట్టణ ప్రజలు ప్రతిస్పందిస్తూ ప్రజలు సేదతీరడానికి పట్టణం నడిబొడ్డున అందరికీ ఉపయోగపడేలా మహద్భాగ్యం అవకాశాన్ని కల్పించిన ఎమ్మెల్యే ఆర్కే రోజా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు పురపాలక సంఘం చైర్మన్ వైస్ చైర్మన్ లు కౌన్సిలర్లు కోఆప్షన్ నెంబర్ లు మరియు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే ఆర్కే రోజా భర్త సెల్వమణి, సోదరులు కుమారస్వామి రెడ్డి పాల్గొన్నారు.