Dec 08,2022 22:52

మున్సిపల్‌ కార్మికులకు యూనిఫాం అందించాలి సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వాడ గంగరాజు

మున్సిపల్‌ కార్మికులకు యూనిఫాం అందించాలి
సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వాడ గంగరాజు
ప్రజాశక్తి- కుప్పం:
కుప్పం మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు గత రెండేళ్లగా యూనిఫాం ఇవ్వకపోవడం దారుణమని.. వెంటనే కార్మికులకు అందించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు డిమాండు చేశారు. గురువారం మున్సిపల్‌ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుప్పంలో పనిచేస్తున్న మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై అధికారులు వెంటనే స్పందించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీల్లో యూనిఫాం, సోపులు, ఆయిల్‌ ఇస్తున్నప్పటికీ కుప్పంలో ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలకు సేవలందిస్తున్నా.. కార్మికులపై నిర్లక్ష్య వైఖరి విడనాడాలని తెలిపారు. పని భారం తగ్గించి కార్మిక సమస్యలపై దష్టి పెట్టాలని డిమాండు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 20, 21వ తేదీల్లో అనంతపురంలో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని.. మహాసభల్లో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు పార్దీబన్‌, గోవిందరాజు, సీఐటీయూ జిల్లా నాయకులు డేవిడ్‌ కుమార్‌, కార్మికులు పాల్గొన్నారు.