ముందస్తు జాగ్రత్తలతో క్యాన్సర్ దూరం
ప్రజాశక్తి-పలమనేరు: ముందస్తు జాగ్రత్తలతో క్యాన్సర్‌ను దూరం చేయవచ్చని.. మొదట్లోనే పరీక్షలు నిర్వహించి మందులు వాడితే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే వెంకటేగౌడ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 'యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్' ఆధ్వర్యంలో.. టాటా ట్రస్టు సహకారంతో శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ వారు నిర్వహించిన ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ హేమంత్‌కుమార్‌రెడ్డి, ఏరియా ఆసుపత్రి అభివద్ధి కమిటీ ఛైర్మన్ చెంగారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ పవిత్ర మురళీకష్ణ, వైసీపీ సీనియర్ నాయకులు మండి సుధా, మున్సిపల్ వైస్ ఛైర్మన్, నాయకులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.రోడ్డు మరమ్మతుల పరిశీలన










