ప్రజాశక్తి-ఉరవకొండ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడుతున్న సిపిఎం నాయకులకు నోటీసులు ఇచ్చి ముందస్తు అరెస్టు చేయడం హేయమైన చర్య అని సిపిఎం మండల కార్యదర్శి మధుసూదన్, జిల్లా కార్యవర్గ సభ్యులు రంగారెడ్డి, రైతుసంఘం నాయకులు సీనప్ప, సిద్ధప్ప అన్నారు. సిఎం జగన్ కళ్యాణదుర్గ పర్యటనను పురస్కరించుకుని శుక్రవారం అర్ధరాత్రి సమయంలో నాయకుల ఇళ్ల వద్దకు వచ్చి నోటీసులు ఇచ్చి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నాయకుము మాట్లాడుతూ ఇళ్ల వద్దకు వచ్చి నోటీసులు ఇవ్వడంతో పాటు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించడం ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమన్నారు. రాత్రి సమయాల్లో పోలీసులు ఇంట్లో దగ్గరికి రావడం మంచి పద్ధతి కాదన్నారు. పోలీసుల ముసుగులో దొంగలు వచ్చి నష్టం జరిగినట్లయితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.
రాయదుర్గం : సిఎం జగన్ కళ్యాణదుర్గం పర్యటన నేపథ్యం లో రాయదుర్గంలో పోలీసులు వామపక్ష పార్టీలు, సంఘాల నేతలకు నోటీసులు అందజేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇందులో భాగంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు నాగరాజు, సిఐటియు నాయకుడు మల్లి కార్జున, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బంగి శివ, సిపిఐ తాలూకా కార్యదర్శి నాగార్జున, మండల కార్యదర్శి దుర్గన్న, తాలూకా అధ్యక్ష కార్యదర్శులు కుమార్‌నాయక్, పిడిఎస్‌యు రాయదుర్గం డివిజన్ కార్యదర్శి మల్లెల ప్రసాద్, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఆంజనేయులు, చేనేత కార్మిక సంఘం నాయకుడు మధు సంగమేష్, వామపక్ష పార్టీలు సంఘాల నాయకులను పోలీసులు అదుపులో ఉంచుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బంగి శివ మాట్లాడుతూ తాము సీఎం పర్యటనను అడ్డుకుంటామని ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ పోలీసులు అదుపులో ఉంచుకోవడం బాధాకరమన్నారు.
రాయదుర్గం స్టేషన్ వద్ద విలేకరులతో మాట్లాడుతున్న వామపక్ష నాయకులు










