Oct 17,2023 22:03

వస్త్రాల తయారీ ప్రక్రియను ప్రదర్శిస్తున్న ఖాదీ కార్మికులు

ప్రజాశక్తి - పొందూరు: ముంబైలోని ఎంఎంఆర్‌డిఎ మైదానంలో నిర్వహిస్తున్న గ్లోబల్‌ మెరిటైన్‌ సమ్మిట్‌లో పొందూరు ఖాదీ వస్త్రాల తయారీ ప్రక్రియలను ఖాదీ కార్మికులు ప్రదర్శించారు. ఖాదీ, గ్రామోద్యోగ కమిషన్‌ (కెవిఐసి) సిఫార్సు మేరకు ఆంధ్రా ఫైన్‌ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘానికి చెందిన ఆరుగురు మహిళా ఖాదీ వడుకు పనివారులు చేపముల్లుతో పత్తిని పరిశుభ్రం చేయడం, నూలు తీయడం వంటి పలు ప్రక్రియలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఆంధ్రా ఫైన్‌ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘ కార్యదర్శి దండా వెంకటరమణ, జల్లేపల్లి శంకరరావు, మహిళా ఖాదీ కార్మికులు కాపల చిన్నమ్మడు, కొండేటి సూర్యకాంతం, మాడుగుల కళ్యాణి, బస్వా జయలక్ష్మి, వి.లక్ష్మి, చదువుల సుగుణావతి తదితరులు పాల్గొన్నారు.