ముఖ్యమంత్రితో మాట్లాడుతున్న మంత్రి ఉషశ్రీచరణ్
అనంతపురం కలెక్టరేట్ : తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి కెవి.ఉషాశ్రీచరణ్ మంగళవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంకు జీవనాడి అయిన బీటీపీ ప్రాజెక్టు కాలువ పనులపై ముఖ్యమంత్రితో ఆమె చర్చించారు. త్వరలోనే బీటీపీ కాలువ పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.










