Apr 26,2023 08:35

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై చర్చిస్తున్న మంత్రి ఉషశ్రీ చరణ్‌

        నార్పల : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి బుధవారం నాడు నార్పలలో చేపట్టే పర్యటను ప్రజలు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సిఎం ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే పద్మావతితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి మంగళవారం పరిశీలించారు. నార్పల మండల కేంద్రం సమీపంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ, హెలీప్యాడ్‌ తదితర ప్రాంతాలను పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జరగబోయే జగనన్న వసతి దీవెన కార్యక్రమంకు జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.