ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ గౌతమి, ఎస్పీ శ్రీనివాసరావు
నార్పల : వసతి దీవెన పథకం ప్రారంభించడానికి ఈనెల 17న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మండల పర్యటనకు రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. ఇందుకు సంబంధించిన సభావేదిక ఏర్పాట్లను కలెక్టర్ గౌతమి, ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించి స్థానిక అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. సిఎం ఉదయం వచ్చి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం తిరుగు ప్రయాణం కానున్నారు. కాగా స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు హెలికాప్టర్ ట్రయిల్ రన్ వేసింది. హెలికాప్టర్‌ను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసాదరెడ్డి, ఆర్డీఓ మధుసూదన్, సిఐ అస్లార్‌బాషా, ఎస్‌ఐ వెంకటప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.










