ప్రజాశక్తి - వీరవాసరం
జిల్లా పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో వీరవాసరం గ్రంథాలయంలో నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఈ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు పలు అంశాల్లో పోటీలు నిర్వహించారు. విద్య, సాంస్కృతిక, కళ, క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ముగింపు రోజున బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంధ పాలకుడు బత్తుల హనుమంతరావు, పంపన సాయిబాబు, వెంపల్ల రాజామణి, కొల్లా బత్తులు సాగర్, మట్టా వెంకటేశ్వరరావు, చింతా వెంకన్న, తామరపల్లి సత్యనారాయణలు పాల్గొన్నారు.










