ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వేసవి శిక్షణ శిబిరం శనివారం ఘనంగా ముగిశాయి. 33 రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలు వందలాది మంది పిల్లలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్ ఎల్‌ఎం ఉమా మోహన్‌రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎడిసిసి బ్యాంకు ఛైర్‌పర్సన్ లిఖిత, రమణా క్యాటరింగ్ అధినేత రవికాంత్ రమణ మాట్లాడుతూ ఉచిత సమ్మర్ క్యాంప్ నిర్వహించి పిల్లల్లో సృజనాత్మకత పెంపుదల చేయడం అభినందనీయమన్నారు. పిల్లలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని పొందిన ఆనందం వెలకట్టలేనిదన్నారు. వారికి తెలియ కుండానే ఆటలు, పాటల్లో పాల్గొని పోటీ తత్వాన్ని అలవర్చుకున్నారని తెలిపారు. సిఎం జగన్ విద్యకు ప్రాధాన్యత ఇస్తూ పిల్లలు అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. వారి ఆలోచనలను అమలు చేయడం ప్రజా ప్రతినిధులుగా బాధ్యతలు నిర్వర్తించడం ఆనందదాయకం అన్నారు. పిల్లలు వేసవి సెలవులను ఎంతో ఉల్లాసంగా ఉత్సాహకంగా గడిపేందుకు గ్రంథాలయాలు వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. చదువుతో పాటు పిల్లలకు ఆట పాటలు కూడా ఉండాలన్నారు. విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమంలో మీనాక్ష్మమ్మ ఫౌండేషన్ ద్వారా సహకారం అందిస్తామన్నారు. సమ్మర్ క్యాంప్‌లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్స్, మెమొంటోలు బహూకరించారు. పిల్లలు సెలవు రోజుల్లో సెల్‌ఫోన్‌లు, టివీలు చూసి సమయం వృథా చేసుకోకుండా సమ్మర్ క్యాంప్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలోని అన్ని శాఖ గ్రంధాలయాలలో ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించామన్నారు. పిల్లలు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేశారని, అందుకు సహకరించిన తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పి.రమ, గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ ఎల్‌ఎం.మోహన్‌రెడ్డి, డిప్యూటీ లైబ్రేరియన్ వి.సుబ్బరత్నమ్మ, సీనియర్ అసిస్టెంట్ శివశంకర్ ప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ రామాంజనమ్మ, సిబ్బంది ఇంతియాజ్ అహమ్మద్, కావేరి, శంకర్, బాషా, హేమమాలిని, నాగమణి, మల్లి, బాలచంద్ర, ఉజ్జనేశ్వరి, రీసోర్స్‌పర్సన్‌లు వెంకటేషప్ప, సూర్య నారాయణ రెడ్డి, లక్ష్మి, రాజేష్, మహేష్, జ్యోతి, హేమలత విద్యార్థుల తల్లి దండ్రులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్ ఎల్‌ఎం ఉమా మోహన్‌రెడ










