పూజల్లో పాల్గొన్న భక్తులు
పూజల్లో పాల్గొన్న భక్తులు
ముగిసిన దసరా ఉత్సవాలు..
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ: దసరా సందర్భంగా నెల్లూరు సిటీలో వివిధ ఆలయాలలో తొమ్మిది రోజులపాటు దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్టోన్ హౌస్ పేటలోని కన్యకా పరమేశ్వరి ఆలయం, రాజరాజేశ్వరి ఆలయం తదితర ఆలయాలలో అమ్మవారు తొమ్మిది రోజులు వివిధ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడం కోసం భక్తులు బారులు తీరారు. అమ్మవారి మూలవిరాటును పురవీధుల్లో ఊరేగించారు. మంగళవారం చివరి రోజు కావడంతో ఆలయాలలో భక్తులు పోటెత్తారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు భోజన వసతిని ఏర్పాటు చేశారు.










