Mar 10,2022 21:50

జూదరుల అరెస్ట్‌ను చూపుతున్న పోలీసులు


రూ.10,800 స్వాధీనం
ప్రజాశక్తి- బి.కొత్తకోట :
ఎస్‌ఐ రామ్మోహన్‌ కథనం మేరకు మండలంలో తమ సిబ్బందితో కలిసి పేకాట, నాటుసారా తయారీలపై దాడులు నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా సీతివారిపల్లి పంచాయతీ, బండారువారిపల్లి సమీపంలో రహస్యంగా జూదమాడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరి నుండి రూ.10,800 నగదు స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో హెడ్‌ కానిస్టేబుల్‌ రవీంద్ర నాయక్‌, సిబ్బంది పాల్గొన్నారు.