Mar 31,2022 22:36

కలెక్టర్‌కు చెక్కును అందిస్తున్న ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే భూమన


సిఎం జగన్‌ ద్వారా పంపిణీకి సిద్ధం : టిటిడి ఛైర్మన్‌
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
టిటిడి ఉద్యోగుల 30 ఏళ్ల కల సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందని టిటిడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. టిటిడి ఉద్యోగుల ఇంటి స్థలాల కోసం 61 కోట్ల 63 లక్షల రూపాయల చెక్కును కలెక్టర్‌కు అందించారు. అనంతరం వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల ఇంటి స్థలాల కోసం వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం గ్రామంలో 300.22 ఎకరాల భూమిని సిద్ధం చేసిన రూ.61.63 కోట్ల చెక్కును ఎంఎల్‌ఎ భూమన కరుణాకర్‌రెడ్డితో కలిసి గురువారం సాయంత్రం కలెక్టర్‌ హరినారాయణన్‌కు అందజేశారు. తిరుపతి పద్మావతి విశ్రాంతి గృహంలో విలేకరులతో వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ టిటిడి ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఎంఎల్‌ఎ కరుణాకర్‌రెడ్డి సిఎం జగన్మోహన్‌రెడ్డిని కోరారని చెప్పారు. తనతోఓ పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడినపుడేసిఎం సానుకూలంగా స్పందించారన్నారు. 5,518 మంది ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి మార్గం సుగమం అయ్యిందన్నారు. వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం గ్రామంలోని సర్వే నంబర్‌ 42లో 300.22 ఎకరాల భూమిని టిటిడి ఉద్యోగులకు ఇంటి స్థలాలుగా ఇవ్వడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.