Apr 18,2023 18:21

ప్రజాశక్తి - తణుకురూరల్‌
ఎపి సీడ్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన టెండర్‌ విధానాన్ని రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌, యూనియన్‌ అధ్యక్షులు టి.రామకృష్ట ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం ఎపి సీడ్స్‌ వద్ద టెండర్‌ రద్దు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న హమాలీ కార్మికులను తొలగించడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో 18 యూనిట్లు ఉంటే అందులో ఎక్కడా లేనివిధంగా టెండర్‌ విధానాన్ని తణుకులోనే ఎందుకు ప్రవేశపెట్టడమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జి.త్రిమూర్తులు, రమణ, శ్రీహరి, సాంబశివరావు, సూరిబాబు పాల్గొన్నారు.