ప్రజాశక్తి-గణపవరం : మండల కేంద్రమైన గణపవరంలో బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో ఆదివారం క్రైస్తవ సోదరులు మట్టల ఆరాధన ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా 300 మంది క్రైస్తవ సోదరులు మట్టలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం చర్చిలో జరిగిన ఆరాధన కార్యక్రమంలో బాప్టిస్ట్ సంఘ ఫీల్డ్ కౌన్సిల అధ్యక్షులు జి డేవిడ్ లివింగ్ స్టన్ ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాల ఆచార్యులు ఎస్ రోజ్ నిర్మల కుమార్ దేవుడు సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరులు ఎస్ ఏలేషు, పి రత్నబాబు కార్యదర్శి ఎస్ మోహన్ రావు, సంఘ పెద్దలు పాల్గొన్నారు.










