ప్రజాశక్తి - పోడూరు
పశు సంవర్థక శాఖ పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో లేగ దూడల ప్రదర్శన, లేగ దూడల పెంపకంపై అవగాహన సదస్సు శుక్రవారం మట్టపర్రు గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాుకి ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ నరసింహారావు మాట్లాడుతూ ప్రతినెలా నట్టల నివారణ మందులు తాగించాలన్నారు. నిర్ణీత సమయంలో టీకాలు వేయించాలన్నారు. దాణా, పచ్చి మేత వేసినట్లయితే త్వరగా ఎదిగి పాడి పశువులుగా తయారయ్యే అవకాశం ఉందన్నారు. అన్నారు. లేగ దూడల ప్రదర్శనలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన సంబంధిత పశువుల యజమానులకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి దొమ్మేటి శ్రీువాస్, ఎడి పి.జయకర్ జాన్సన్, మండల పశువైద్యాధికారి మహేష్‌కుమార్, రవికాంత్ పాల్గొన్నారు.










