ప్రజాశక్తి-అనంతపురంకలెక్టరేట్ దేశంలో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వ అవలంభిస్తున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటా లు చేద్దామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు పిలుపు నిచ్చారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి సందర్భంగా శుక్రవా రం కళ్యాణదుర్గం పంపుహౌస్ వద్ద 'కార్మికులు, లౌకికతత్వం, మతతత్వ రాజకీయాలపై స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశారు. ముందుగా పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమసమాజ స్థాపనకు కృషి చేసిన పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు అవరోధంగా, కార్మికుల ఐక్యతకు భంగం కలి గించే మతతత్వ రాజకీయాలు, నయా ఉదారవాద ఆర్థిక విధా నాలకు వ్యతిరేకంగా పొరాటమే ఏకైక మార్గం అన్నారు. కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం దేశభక్తిని అడ్డుపెట్టుకుని కార్పొరేట్ కంపె నీలకు అనుకూలంగా లేబర్ కోడ్‌లు మార్చి కార్మికుల శ్రమను దోచిపెడుతోందని ఆరోపించారు. మహాత్మ గాంధీని హత్య చేసిన ఆర్‌ఎస్‌ఎస్ గాడ్సేను దేవుడిగా అభివర్ణించే బిజెపి ఎంపిలు దేశానికి బంగారు పతకాలు సాధించిన రేజ్లర్లను వేధించిన ఎంపి పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించిన ఆనాటి హోం మినిష్టర్ సర్దార్ వల్లభారు పటేల్ నిలువెత్తు విగ్రహాన్ని స్థాపించి దండలు వేస్తూ.. పుల్వామా ఘట నలో అనేకమంది సైనికుల మృతికి కారణమైన బిజెపి నాయకు లు దేశభక్తి గురించి మాట్లాడుతుం టూ 'దెయ్యాలు వేదాలు' వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో.. బిజెపి మాటల్లో దేశభక్తి కూడా అంతే ఉం టుందన్నారు. రైతులకు వ్యతిరేకంగా, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా పార్లమెంట్‌లో చేసిన చట్టాలకు వ్యతిరేకంగా 370 రోజులు పోరాడి మోడీ ప్రభుత్వాన్ని మెడలు వంచి రద్దు చేసుకోగలిగామన్నారు. అదేస్ఫూర్తితో రానున్న రోజుల్లో మతతత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు సాగిద్దామని పిలుప ునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రాము, ఉపాధ్యక్షులు ప్రభాకర్, ట్రెజరర్ వన్నూరుస్వామి, ఆర్గనైజర్ ఎం.నాగరాజు, మండల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు










