సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు పిలుపు
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్:
మంగళవారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం సిపిఎం కార్యాలయంలో కె.సురేంద్రన్ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన దడాల సుబ్బారావు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మతోన్మాద విధానాలతో పాటు కార్మిక రైతు ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. ప్రజల పై దాడి చేస్తున్నారని విమర్శించారు అదే విధంగా రాష్ట్రాల స్వతంత్ర హక్కులను కాలరాస్తూ తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ఉన్న చట్టాలను, రాజ్యాంగాన్ని రద్దు చేయడం ఏమిటని ప్రశ్నించారు దేశంలో ఉన్న బడా పెట్టుబడిదారులు, కార్పొరేట్లకు అనుకూలంగా దేశ సంపదను వారికి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు ఈ విధానాలకు వ్యతిరేకంగా మార్చి 28 29 న చేపట్టిన కార్మిక సంఘాలు ఫెడరేషన్ సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు సిపిఎం పశ్చిమ కమిటి జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రజా సమస్యలపై అన్ని గ్రామాల్లో అధ్యయనం చేసి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి. శ్రీనివాసులు, జిల్లా నాయకులు ఓబులురాజు, భువనేశ్వరి సీనియర్ నాయకులు చల్లా వెంకటయ్య పాల్గొన్నారు.










