ప్రజాశక్తి-భీమవరం : దేశానికి అత్యున్నత పథకాలను తీసుకువస్తున్న భారత క్రీడాకారుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి దుర్మార్గంగా ఉందని సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్వి గోపాలన్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు చెల్లబోయిన రంగారావు విమర్శచారు. రెజర్ల పట్ల బిజెపి ఎంపీ వేధింపులకు నిరసిస్తూ, ఎన్నో రోజుల నుంచి ఆందోళన చేస్తున్న పట్టించకపోవడానికి నిరసిస్తూ భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీ నడిబొడ్డులో గత కొంతకాలంగా బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ సింగ్ ను అరెస్టు చేయాలని, క్రీడాకారులపై లైంగిక వేధింపులు అరికట్టాలని ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుందని అన్నారు. ఆందోళనకు ఆటంకాలు కలిగిస్తూ వారికున్న సౌకర్యాల్ని తొలగిస్తూ ప్రభుత్వం కూడా వేధింపులకు పాల్పడుతుందని అన్నారు. చివరికి వారు పొందిన క్రీడా పథకాలను కూడా తిరిగి ఇచ్చేయడానికి సిద్ధపడుతున్న, రేస్లర్స్ చెబుతున్న సమస్యలను కనీసం పరిశీలన చేయటానికి కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపకపోవడం దారుణమని అన్నారు. అనేకమంది క్రీడాకారులు, కళాకారులు, మేధావులు, అభ్యుదయవాదులు రాజకీయ పార్టీలు క్రీడాకారుల ఆందోళనకు మద్దతుగా ఉంటే తట్టుకోలేని కేంద్ర ప్రభుత్వం ఆందోళనకారులపై కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుందని, ఇది అత్యంత దుర్మార్గమైన అన్నారు. ఆందోళన చేస్తున్న రెస్లర్స్ కు మద్దతుగా కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల సమన్వయ కమిటీ, ప్రజా సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని పిలుపునీచిదన్నరు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి లైంగిక వేధింపులకు పాల్పడ్డా బిజెపి ఎంపీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి బి వాసుదేవరావు, ఎం ఆంజనేయులు, ఎం వైకుంఠరావు, కే సత్యనారాయణ, ఎం మునీయ, వై.విఆనంద్, ఆకలిరాము, డి సత్యనారాయణ పాల్గొన్నరు.










