మహాజనసభలో అఖిలపక్ష నాయకులు
ప్రజాశక్తి - ఆచంట
ఆచంట మృత్యుంజయ విశాల సహకార పరపతి సంఘంలో పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగులకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా తొలగించడం అన్యాయమని అఖిలపక్ష నాయకులు బలుసు శ్రీరామ్మూర్తి అన్నారు. మృత్యుంజయ సొసైటీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం మహాజన సభ కార్యదర్శి పారుపల్లి యేసురత్నం అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహాజన సభలో పలువురు మాట్లాడుతూ చారిత్రాత్మక, ప్రసిద్ధి ఆర్థిక అభివృద్ధిలో రాష్ట్రంలో తలమానికమైన సొసైటీని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయపార్టీలపై, రైతులపై, ప్రజలపై ఉందన్నారు. నా బార్డ్ రుణాలు సొసైటీకి ఆర్థిక భారం, ఉనికికి ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉన్నందున మహాజనసభ నా బార్డ్ గ్రాంటును ఏకగ్రీవంగా తిరస్కరించేందుకు అఖిలపక్ష సభ్యులు తీర్మానించారు. కొత్తగా రూ.2.14 కోట్లు పైలెట్ ప్రాజెక్టు నిర్మాణం కోసం నాబార్డ్ నుంచి నిధులు తీసుకునేందుకు డిసిసిబి నుంచి అనుమతి తీసుకోవాలని తీర్మానించారు. ఐదుగురు సీనియర్ ఉద్యోగులకు ముందుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సిబ్బందిని తొలగించడం అన్యాయమన్నారు. తొల గించిన ఉద్యోగులతో పాటు కొత్తగా నియమించిన ఉద్యోగులను కూడా కొనసాగించాలని అఖిలపక్షం తీర్మానించింది. పరపతి సంఘం నిధుల దుర్వినియోగంపై, పైలెట్ ప్రాజెక్ట్, రైస్‌మిల్, గోడౌన్ తదితర వాటిపై కమిటీ సభ్యులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని, దీంతో రూ.మూడు కోట్లు డిపాజిట్ దారులు వెనుకకు తీసుకునేందుకు సిద్ధపడ్డారని చెప్పారు. దీంతో లాభాల్లో ఉన్న సొసైటీ నష్టాల బాట పడుతుందని అఖిలపక్ష సభ్యులు ఆందోళన చేశారు. తక్షణమే ఇటువంటి తప్పుడు నిర్ణయాలను వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సొసైటీకి డిపాజిట్లు పెంచడంలోనూ అభివృద్ధికి పాటుపడిన సెక్రటరీ పారుపల్లి యేసురత్నంను తొలగించాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే సొసైటీ వద్ద ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్ పర్సన్ పెచ్చెట్టి సత్యనారాయణ, పర్సన్స్ మొండి శ్రీనివాస్, వైట్ల కిషోర్‌కుమార్, తమ్మినేడిిి ప్రసాద్, కానుమిల్లి జోగరాజు, నెక్కంటి సతీష్, గొడవర్తి భాస్కరరావు, కమ్మ సత్యనార ాయణ, సిపిఎం నాయకులు సిర్రా నరసింహమూర్తి, వద్దిపర్తి అంజిబాబు, ఎస్‌విఎన్.శర్మ, తోటపల్లి సత్యనారాయణ, తలుపూరి బుల్లబ్బాయి పాల్గొన్నారు.










