Sep 30,2022 23:18

చిత్తూరు జిల్లా అడిషనల్‌ ఎస్పీ జగదీష్‌ చెక్కు అందజేసారు.

అడిషనల్‌ ఎస్పీ జగదీష్‌
ప్రజాశక్తి -చిత్తూరుఅర్బన్‌

పుంగనూరు పోలీసు స్టేషన్‌ నందు పిసి గా విధులు నిర్వహిస్తూ ఈనెల 28వ తేదిన అనారోగ్యంతో జయప్రకాష్‌ మృతిచెందారు. ఆయన సతిమణి మంజులమ్మకు తక్షణ ఆర్థిక సాయం క్రింద లక్ష రూపాయల చెక్కును చిత్తూరు జిల్లా అడిషనల్‌ ఎస్పీ జగదీష్‌ గురువారం పోలీసు అతిధి గృహంలో అందజేసారు. ఈ సందర్భంగా అడిషనల్‌ ఎస్పీ మతుడి భార్యకు భరోసా ఇస్తూ పోలీస్‌ డిపార్టుమెంటు తరపున వారి కుటుంబానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్‌ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ మోహన్‌ రావు, ఏఏఒ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.