ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు బిలాల్ నగర్ సచివాలయం, దూబగుంట క్లస్టర్ పరిధిలోని గృహ సారథి మతుడు చదలవాడ కోటేశ్వరరావు కుటుంబ సభ్యులను ఎంఎల్‌ఎ మానుగుంట మహిధరరెడ్డి శనివారం పరామర్శించారు. కుటుంబానికి మనోధైర్యం కల్పించారు. గృహ సారధి సారధి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సచివాలయం గహ సారథి చదలవాడ కోటేశ్వరరావు మతి వైసిపికి తీరని లోటని పేర్కొన్నారు. కోటేశ్వరరావు పార్టీ కోసం ,జగనన్న కోసం సైనికుని వలే పని చేశారని కితాబిచ్చారు. మానవ జీవితంలో మరణం సహజమని.. విధి రాత ఎవ్వరూ మార్చలేనిదని మహీధర్ రెడ్డి పేర్కన్నారు. చిన్న వయసులోనే కుటుం బానికి దూరమైన కోటేశ్వరరావు (కుటుంబ పెద్ద) లేని లోటు తీర్చలేని దన్నారు.మృతుడు కోటేశ్వరరావు కుమారుడు, కూతురు లను ఓదార్చి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైసిపి బీమా కాకుండా రూ. 2 లక్షల ఆర్థిక సాయం చెక్కు రూపంలో మతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జెసిఎస్ కో ఆర్డినేటర్ ముప్పవరపు కిషోర్, పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ, పాశం కొండయ్య ,భోగిశెట్టి దత్తాత్రేయ ,చనమాల కోటేశ్వరరావు ,షేక్ రహీం, మాజీ ఎయంసి చైర్మన్ తోకల కొండయ్య, గణేషం గంగిరెడ్డి , పల్నాటి బాలకష్ణ,మేళం నాగేశ్వరరావు, చదలవాడ జక్రయ్య ఉన్నారు.










