Feb 20,2022 16:25

ప్రజాశక్తి-కలకడ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రెండు కుటుంబాలను అన్నివిధాల ఆదుకుంటామని పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని నడిమిచెర్ల లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రెండు కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈనెల 18వ తేదీన రాత్రి  సమయంలో గుర్రంకొండ మండలం నడిమి కండ్రిక గ్రామంలో సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ ఒక ఇంటిలోకి దూసుకెళ్లిన ఘటనలో లారీలో ప్రయాణిస్తున్న లారీ డ్రైవర్ సదాశివ, లారీ క్లీనర్ నాగరాజా మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బలంగా గాయపడిన కుమార్ వైద్య సేవలు పొందుతున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సదా శివ, నాగరాజా కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.అనంతరం మృతి చెందిన బాధితులకు అంత్యక్రియలు నిర్వహణ కోసం ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కలికిరి మార్కెటింగ్ యాప్ కమిటీ చైర్మన్ రవి కుమార్ రెడ్డి, ఎంపీపీ శ్రీదేవి రవికుమార్,  సర్పంచ్ నల్లమ్మ, ఎంపీటీసీ కృష్ణారెడ్డి, నాయకులు నరసింహారెడ్డి, నాగ మోహన్ రెడ్డి,  రవికుమార్ ,స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.