Feb 21,2022 23:55

మృతుల కుటుంబాలను పరామర్శిస్తున్న ఉప ముఖ్యమంత్రి

ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌:
వెదురుకుప్పం మండలానికి చెందిన వారు ఆదివారం రాత్రి హార్సిలీ హిల్స్‌కు వెళుతూ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించడం, పది మందికి గాయాలవడం చాలా బాధాకరమైన విషయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి పేర్కొన్నాడు. సోమవారం మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో ఎమ్మెల్యే యం.నవాజ్‌ భాష, ఆర్‌డిఓ, యం.ఎస్‌. మురళితో కలిసి జిల్లా ఆసుపత్రిలో ఉన్న మృతదేహాలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ వెదురుకుప్పం మండలానికి చెందిన వారు ఆదివారం చౌడేపల్లి మండలం, బోయకొండ గంగమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరం పర్యాటక కేంద్రమైన హార్సిలీ హిల్స్‌కు వెళ్లే మార్గంలో రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు మరణించడం జరిగిందని, సుమారు పది మందికి గాయాలయ్యాయిని తెలిపారు. ఈ సంఘటన జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్‌ ఎం. హరి నారాయణన్‌ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో, మదనపల్లె ఆర్‌డిఓ మురళి, డి.ఎస్‌.పి రవి మనోహరిచారి వైద్యాధికారులు ఆలస్యం చేయకుండా వెంటనే గాయపడినవారిని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారని తెలిపారు. రాత్రి 11 గంటలకు వాహనాలు ఏర్పాటు చేసి గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించుట కోసం నారాయణాద్రి, స్విమ్స్‌ ఆసుపత్రులకు తిరుపతికి పంపించడం జరిగిందని తెలిపారు. ఈ సంఘటనపై రాష్ట్ర వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకు పోవడం జరిగిందని, ముఖ్యమంత్రి కూడా మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవడంతో పాటు ఎక్స్‌గ్రేషియా చెల్లించడం జరుగుతుందన్నారు. మానవ సేవే మాదవసేవగా భావించి అన్ని కుటుంబాలు తన కుటుంబంగా భావించే వ్యక్తి ముఖ్య మంత్రిని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, వారు వెంటనే కోలుకోవాలని ఆ భగవంతున్ని వేడుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డియం అండ్‌ హెచ్‌ఓ, డాక్టర్‌ లక్ష్మి, మెడికల్‌ సూపర్డేంటెండ్‌ డాక్టర్‌ ఆంజనేయులు, వైద్య సిబ్బంది, జడ్పీటిసి ఉదరు కుమార్‌, మున్సిపల్‌ వైఎస్‌ చైర్మన్‌ జింక చలపతి, వార్డు కౌన్సలర్లు తదితరులు పాల్గొన్నారు.