Oct 26,2023 17:21

తీరానికి కొట్టుకొచ్చిన మధ్యప్రదేశ్‌ యువకుల మృతదేహాలు

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్‌లో గల్లాంతైన మతదేహాలు బుధవారం లభ్యమ య్యాయి. వివరాల మేరకు...నెల్లూరు ఆత్మకూ రు బస్టాండ్‌ సమీపంలో కూలి పనులు చేసుకొం టూ జీవనం సాగిస్తున్న మధ్యప్రదేశ్‌ రాష్ట్రం పా లాఘాట్‌ జిల్లాకు చెందిన యువకులు రాహుల్‌ బూత్‌ (19), కైలాష్‌ జోషి (33) కుటుంబ సభ్యు లతో కలసి ఈ నెల 25వ తేది ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్‌ లో మునుగుతూ గల్లం తు అయిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు యు వకుల మతదేహాలు గురువారం తోటపల్లిగూ డూరు మండలం కోడూరు (పాతపాలెం) సము ద్ర తీరానికి కొట్టుకొచ్చాయి. యువకుల మతదే హాలను తోటపల్లిగూడూరు పోలీసులు స్వాధీ నం చేసుకొన్నారు. పోస్టుమార్టం కోసం మతదే హాలను ఎస్‌ఐ జంపాని కుమార్‌ నెల్లూరు ప్రభు త్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.