Oct 06,2022 22:27

మరో 'ప్రతిఘటన' చేయాలనుంది
సాగర్‌ చికెన్‌ మార్కెట్‌ ప్రారంభించిన సినీ నటులు చరణ్‌ రాజ్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

మరో ప్రతిఘటన సినిమా తెలుగులో చేయాలని ఉందని సినీనటులు చరణ్‌రాజ్‌ తెలిపారు. బుధవారం చిత్తూరు నగరంలోని మురుకంబట్టులో సాగర్‌ చికెన్‌ మార్కెట్‌ను సినీనటుడు, హీరో చరణ్‌ రాజ్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు, తిరుపతి నగరాల్లో నాణ్యమైన సరసమైన ధరలకు సాగర్‌ చికెన్‌ అమ్మడం జరుగుతుందన్నారు. తాను 3వ చికెన్‌ సెంటర్‌ ప్రారంభించడం జరుగుతుందన్నారు. సాగర్‌ చికెన్‌ సెంటర్‌ యజమాని క్వాలిటీతో కూడిన హౌల్సేల్‌ ధరలకే మంచి చికెన్‌ అందిస్తున్నారని అభినందించారు. ప్రస్తుతం తన కుమారుడు దేవచరణ్‌ కుప్పన్‌ అనే తమిళ్‌ చిత్రం హీరోగా నటిస్తున్నారని తన కుమారునితోపాటు ఆదిరాం ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రానికి తనే కథను రాసి డైరెక్షన్‌ చేస్తున్నట్లు వివరించారు. చిత్తూరు ప్రజలకు సినిమా రిలీజ్‌ అయిన తర్వాత ఒక షోఫ్రీగా ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమాతో బిజీగా ఉన్నానన్నారు. కో డైరెక్టర్‌గా జనార్ధన్‌ వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. చిత్రం రిలీజ్‌ అయిన తర్వాత ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ రాష్ట్ర వైస్‌చైర్మన్‌ విజయనందర్‌రెడ్డి, చికెన్‌ సెంటర్‌ యజమాని చిట్టినాయుడు, జనార్ధన్‌, కార్పొరేటర్‌ శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.