ప్రజాశక్తి-నంతపురం కలెక్టరేట్ మరణం తర్వాత కూడా జీవించి ఉన్న వ్యక్తి ఫాదర విన్సెంట్ ఫెర్రర్ అని, ఎన్నో కష్టనష్టాలు, వ్యయ ప్రయాసల కోర్చి స్పందించు సాయమందించు అన్న నినాదంతో జిల్లాలో ఆర్‌డిటి సంస్థలు స్థాపించిన మహోన్నత వ్యక్తి అని అవే సంస్థ అధ్యక్షుడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి కొనియాడారు. ఆదివారం విన్సెంట్ ఫాదర్ పెర్రర్ జయంతి పురస్కరించుకొని నగరంలోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి, ఆర్ డిటి సంస్థ ప్రతినిధి విశాల పెర్రర్, డైరెక్టర్ తిప్పేస్వామి, కుల సంఘాల నాయకులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆయన కృషికి కతజ్ఞతగా అవే సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ఆయన విగ్రహం ఏర్పాటు చేశామన్నారు.
మరింత విస్తత పరుస్తాం : విశాల ఫెర్రర్
ఆర్‌డిటి సేవలను మరింత విస్తత పరుస్తామని ఆ సంస్థ ప్రతినిధి విశాలా ఫెర్రర్ పేర్కొన్నారు. ఫాదర్ పెర్రర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ స్పందించి సాయం అందించు కార్యక్రమం ద్వారా జిల్లాలో ఎంతోమందికి సేవలందిస్తున్నామన్నారు. మరిన్ని సేవలు అందించడానికి ఆర్ డిటి సంస్థ ముందుంటుందని తెలిపారు. కార్యక్రమంలో అవే సంస్థ జిల్లా అధ్యక్షులు బంగి నాగ, కేపీ నారాయణస్వామి, బిఎస్ దాస్, జిల్లా తెలుగుదేశం పార్టి అధికార ప్రతినిధులు సరిపూటి రమణ, నారాయణస్వామి యాదవ్, నగర మహిళా అధ్యక్షురాలు విజయశ్రీరెడ్డి, రాష్ట్ర యాదవ కురవ కోఆర్దినేటర్ శివబాల, రాష్ట్ర గాండ్ల సాదికార అద్యక్షురాలు విశాలాక్షి, మాజీ కార్పొరేటర్ రాధదేవి, ఉమామహేష్, జిల్లా మహిళా అధికారనిధి వసుంధర, రాష్ట్ర నాయకులు కూచిహరి తదితరులు పాల్గొన్నారు.
పుట్లూరు : అరకటివేముల గ్రామంలో విన్సెంట్ ఫెర్రర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆర్‌డిటి స్కూల్లో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ నాలెడ్జ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఆర్‌డిటి డైరెక్టర్ బి.రాజశేఖర్‌రెడ్డి, రీజినల్ డైరెక్టర్ నారాయణరెడ్డి, ఎటిఎల్ సుశీలమ్మ, సర్పంచి బొమ్మోళ్ల ఏసమ్మ, ఉప సర్పంచి లొడుగు లక్ష్మినారాయణమ్మ, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్ బొమ్మోళ్ల శ్రీనివాసులు, వైస్ ఛైర్‌పర్సన్ బడేంకటి కుల్లాయమ్మ పాల్గొన్నారు.










