ప్రజాశక్తి-అనంతపురం 20వ శతాబ్ధి తెలుగు కవుల్లో విశిష్ట స్థానం సంపాదించుకుని మరణంలేని కవిగా గుర్రం జాషువా నిలిచిపోయారని డిప్యూటీ మేయర్ కొగటం విజయభాస్కర్‌రెడ్డి కొనియాడారు. జాఘువా వర్థంతిని పురస్కరించుకుని జాషువా సాహిత్య పీఠం ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని ఆర్ట్స్ కళాశాల ప్రధాన గేటు ముందు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖండకావ్యాల రారాజు జాషువా సమాజంలో మార్పును కోరుకున్న గొప్ప కవి అన్నారు. తన సాహిత్యం ద్వారా సమాజానికి దిశానిర్దేశం చేశారని తెలుగు శాఖ ఆచార్య జి బాలసుబ్రమణ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో జాషువా సాహిత్య పీఠం అధ్యక్షులు జి.బాలసుబ్రమణ్యం, ప్రధాన కార్యదర్శి హెచ్.నాగలింగయ్య, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ దివాకర్‌రెడ్డి, మాజీ ప్రిన్సిపాల్ ఎన్.రంగస్వామి, నానీల నాగేంద్ర, పూజారి ఈరన్న, మానవత తరిమెల అమర్నాథ్‌రెడ్డి ఆర్ట్స్ కళాశాల తెలుగు శాఖ అధ్యాపకులు యోగేశ్వరనాయుడు, అంకే శ్రీనివాసులు, అంకే మదన్మోహన్, ప్రజా గాయకుడు దాసరి ఆదినారాయణ, అకాడమీ కన్సల్టెంట్లు నాగేంద్ర, కె.జగదీష్, తన్నీరు నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
కవి గుర్రం జాషువాకు నివాళులర్పిస్తున్న అతిథులు










