మరమగ్గ కార్మికుల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యం
ప్రజాశక్తి-నగరి: మరమగ్గ కార్మికుల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యమిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా అన్నారు. శనివారం మున్సిపల్ పరిధి సత్రవాడ వినా యకపురంలో ఆమె గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థాని కులు గజమాలలు, దుశ్శాలువాలతో హారతులు పట్టి ఆమెను ఆహ్వానించారు. మండల స్థాయి అధికారుల తో కలసి ఆమె ప్రతి గడపకు పర్యటించి నాలుగేళ్ళలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా చేకూరిన లబ్దిని నివాశితులకు వివరిస్తూ సంక్షేమ బుక్‌లెట్స్‌ను అందజేశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త నేత సామాజివర్గానికి చెందినవారే అని, తాను ఆ సామాజిక వర్గ పు ఆడపడుచునే అన్నారు. ఆప్కోకు మాత్రమే పరిమిత మైన ప్రభుత్వ యూనిఫామ్స్ తయారీని ముఖ్యమంత్రితో చర్చించి స్థానిక మరమగ్గ కార్మికులకు తీసివ్వడం జరిగింద న్నారు. కోవిడ్ సమయంలో ఆ ఆర్డుర్లు ఎంతో మంది మరమగ్గ కార్మికులకు ఉపాధినిచ్చిందన్నారు. వివిధ సంక్షే మ పథకాలతోను మరమగ్గ కార్మికులను ఆదుకుంటున్నామ న్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తనకు ఎంతో అనుభవం ఉందని గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదన్నారు. 2019లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల ఆర్థికాభివద్ధే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని, ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరిందన్నారు. ఏదైనా సాంకేతిక కార ణాల మూలంగా ప్రభుత్వ పథకాలకు దూరమైన పేదలను గుర్తించి న్యాయం చేయడానికి గడప గడపకు మన ప్రభు త్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వా నికే దక్కిందన్నారు. చంద్రబాబు తన హయాంలో చెప్పుకు నేలా చేసిందేమీ లేనందున నిస్ప్రుహకు గురయ్యారని, ప్రజలను అయోమయం చేసేందుకు అసత్యారోపణలు, ఉద్రేకపూరిత ప్రసంగాలు చేస్తూ రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం విద్య, వైద్య, వ్యవసాయ రం గాలకు ఇస్తున్న ప్రాధాన్యతను, ఆ దిశగా అమలు చేసిన పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా విశదీకరించారు. పిల్లలను బడికి పంపే ఏ తల్లి ఆర్థికంగా ఇబ్బంది పడ కుండా అమ్మ ఒడితోపాటు జగనన్న విద్యా కానుక, విద్యా, వసతి దీవెనలు, విదేశీ విద్య తదితర పథకాలను సీఎం అమలు చేస్తున్నారని వివరించారు. నాడు-నేడు పథకంతో ప్రభుత్వ బడులను ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా మార్చిన విషయాన్ని గుర్తు చేయాలన్నారు. సచివాల య, వాలంటీర్ వ్యవస్థ ద్వారా పాలన ప్రజలకు చేరువైంద న్నారు. మేలు చేసిన వారిని గుర్తుంచుకుంటే అభివృద్ధికి బా టలు వేసినవారవుతారన్నారు. ప్రజలు చెప్పిన సమస్యలను విన్న ఆమె గడప గడపకు నిధుల ద్వారా సమస్యలు పరి ష్కారమౌతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌ఛై ర్మన్ బాలన్, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలకష్ణ, మున్సిపల్ పార్టీ కన్వీనర్ బీఆర్వీ అయ్యప్పన్, జిల్లా నేత అనుబంధశాఖ అధ్యక్షులు కన్నాయిరం, మున్సిపల్ సచివాలయ కన్వీనర్ దయానిధి, మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.










