- తుడా వీసీ హరికష్ణ
ప్రజాశక్తి- కార్వేటినగరం : రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆదేశాల మేరకు పాదిరికుప్పాన్ని మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తుడా వీసీ హరికష్ణ అన్నారు. ఈ సందర్భంగా శనివారం పాదిరి కుప్పం గ్రామాన్ని సర్పంచ్ దొరస్వామితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా తుడా వీసీ మాట్లాడుతూ పాదిరి కుప్పం గ్రామంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక సిద్ధమవుతుందని తెలిపారు. గ్రామస్తులు కన్న కల త్వరలో సాకారం కానుందన్నారు. గ్రామంలో విలేజ్ పార్క్, రోడ్డుకు ఇరువైపులా కొబ్బరి మొక్కలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా నూతన కమ్యూనిటీ భవనం, పంచాయతీ భవనం నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. అనంతరం పాదిరికుప్పం బ్రహ్మని సందర్శించి నూతన నిర్మాణాలపై చర్చించారు. అనంతరం గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. వారి వెంట తుడా కార్యదర్శి లక్ష్మి, ఇరిగేషన్ ఈఈ (తిరుపతి) శివారెడ్డి, మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఆర్. సుబ్రహ్మణ్యం,వైయస్‌ఆర్ సీపీ నాయకులు రమేష్ బాబు,కెనాడి,దొరస్వామిరాజు, గోవర్ధన్, శివ,పలువురు ఉన్నారు.










