మోడల్ స్కూల్‌ను తనిఖీ చేసిన డీవైఈవో
ప్రజాశక్తి- బైరెడ్డిపల్లి : మండలంలోని కమ్మనపల్లి ఆదర్శ పాఠశాలను చిత్తూరు జిల్లా డీవైఈఓ విజయేంద్రరావు ఆసక్మికంగా శనివారం తనిఖీ చేశారు. ఈ సదర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులతో సమావేశమై పాఠశాలలో అమలవుతున్న సంసిద్ధత కార్యాక్రమం, బేస్‌లైన్ టెస్ట్, జెవికె కిట్ల పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల విద్యా ప్రమాణాలపై విచారించారు. అలాగే మధ్యాహ్న భోజనం తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం పెట్టాలన్నారు. ఉపాధ్యాయులు బయోమెట్రిక్ సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ జెవికె కిట్లను అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ కార్తీక్, పాధ్యాయులు పాల్గొన్నారు.










