Aug 09,2022 22:43

మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య

ప్రజాశక్తి- వి కోట
కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాస్తూ, తమను వ్యతిరేకించే వాళ్లపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య అన్నారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంగళవారం సామూహిక జన జాగరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశానికి వారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆగస్టు 15న భారతదేశ ప్రజలు 76 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనున్న తరుణంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దీనిని అమతమహౌత్సవం కార్యక్రమంగా జరుపుకోవాలనడం హాస్యాస్పదం అన్నారు. వాస్తవానికి మోడీ ప్రభుత్వం సామాన్య ప్రజలకు, కార్మికులకు అమతాన్ని కాకుండా విషాన్ని పంచిపెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఆరెస్సెస్‌ లకు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకునే అర్హత లేదన్నారు. వాస్తవానికి స్వాతంత్య్ర పోరాటానికి వారసులైన రైతులు కార్మికులు శ్రామికవర్గానికి మాత్రమే స్వాతంత్య్ర దినాన్ని జరుపుకునే హక్కు ఉందన్నారు. ఇందులో భాగంగా ఆగస్టు1 నుండి 14 వరకు మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీఐటీయూ ఉద్యమించాలని పిలుపు ఇచ్చినట్లు వారు తెలిపారు ప్రజలు ధరల భారాన్ని మోయలేక పోతున్నారని, నిత్యావసర వస్తువులతో పాటు పెట్రోల్‌ డీజిల్‌ వంటగ్యాస్‌ ధరలు అమాంతం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. సబ్‌ కే సాత్‌ సబ్‌ కా వికాస్‌ నినాదం అలంకారప్రాయంగా మిగిలిందని ఎద్దేవా చేశారు. కార్మిక హక్కులకు విఘాతం కల్గిస్తూ చట్టాల్లో సవరణలు చేస్తూ వారి హక్కులను కాలరాస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం యజమానులకు అమతాన్ని పంచుతూ కార్మికుల జీవితాల్లో విషాదాన్ని నింపుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి అనిత, అంగన్వాడీ ప్రాజెక్టు కార్యదర్శి శ్యామల, వీఆర్‌ఏ జిల్లా జాయింట్‌ సెక్రటరీ కోదండ, పంచాయతీ కార్యదర్శి గోవింద, ఉదరు వీఆర్‌ఏల సంఘ నాయకులు వెంకటేష్‌, కష్ణమూర్తి పాల్గొన్నారు