వైద్యశిబిరాన్ని నిర్వహిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
మహతి ఆడిటోరియం సమీపంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి మంచి స్పందన విచ్చిందని డాక్టర్ రెడ్డెప్ప తెలిపారు. మొల్ల విగ్రహానికి పూలమాల వేసి, పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. అన్నధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 300 మంది రోగులకు ఉచితంగా బిపి, షుగర్ పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మొల్ల కమిటీ అధ్యక్షులు కేశవులు వడయార్ కార్యదర్శి రోశయ్య, కోశాధికారి మునిచంద్ర, శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ జమున పాల్గొన్నారు.










