మొక్క నాటి నీరు పోస్తున్న సీనియర్ సివిల్ జడ్జి టి.హరిత
ప్రజాశక్తి-గుత్తి మొక్కలను నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సీనియర్ సివిల్ జడ్జి టి.హరిత పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణ ంలోని ప్రత్యేక సబ్‌జైలు, న్యాయస్థానాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ చెట్ల పెంపకంతో వర్షాలు బాగా కురుస్తా యన్నారు. చెట్లను కొట్టడం వల్ల వాతావరణ సమతుల్యం లోపిస్తుందన్నారు. ముందుగా సబ్‌జైలును తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక సబ్‌జైల్ సూపరింటెండెంట్ వడ్డే మహేశ్వరుడు, వైద్యాధికారి విష్ణుమూర్తి, సబ్ రిజిస్ట్రార్ గురునాథ్, న్యాయవాది విసి.గంగాధర్ కుమార్, సిబ్బంది ఎస్.సాదిక్‌వలి, యోగా మాస్టర్ కృష్ణ, గుత్తి కోట సంరక్షణ సమితి నాయకులు విజయభాస్కర్, సుధాకర్‌నాయుడు, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.










