ప్రజలతో మాట్లాడుతున్న డీఎస్పీ గంగయ్య
ప్రజాశక్తి-తాడిపత్రి రూరల్ మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం వేడుకలను మండల ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని డీఎస్పీ గంగయ్య సూచించారు. సమస్యాత్మక గ్రామాలైన తలారి చెరువు, ఊరుచింతల గ్రామాల్లో డీఎస్పీ మంగళవారం పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొహర్రం వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు. పండుగ సమయంలో ఏవైనా గొడవలకు ప్రేరేపిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్‌ఐ గౌస్ మహమ్మద్, రూరల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










