మరమ్మతులకు గురైన డ్రెయిన్
రహదారిపైకి చేరుతున్న మురుగునీరు
ఇబ్బందుల్లో ప్రజలు, వాహనదారులు
ప్రజాశక్తి - మొగల్తూరు
మొగల్తూరులో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. గాంధీ బొమ్మ సెంటర్ ప్రాంతంలో మురుగు డ్రెయిన్ సక్రమంగా నిర్వ హించడంలేదు. సినిమా హాలు ప్రాంతం నుంచి మసీద్ సెంటర్ ప్రాంతం గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా కొనాయికోడి వరకు గతంలో భూగర్భ డ్రెయిన్‌ను ఏర్పాటుచేశారు. ఈ డ్రెయిన్ మరమ్మతులకు గురైంది. పలుచోట్ల ధ్వంసమై మురుగునీటి ప్రవాహానికి ఆటంకంగా మారింది. కొన్నిచోట్ల మర మ్మతులు చేసేం దుకు పంచాయతీ సిబ్బంది గుం తలు తవ్వారు. నెల రోజులు కావస్తున్నా పనులు చేయకుండా అలాగే వదిలేశారు. పాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మసీదు ప్రాంతం తదితర చోట్ల డ్రెయినేజీ నుంచి మురుగునీరు రహదారిపై పారుతుంది. వాహన చోదకులు, సమీప ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దుర్వాసన వెదజల్లడంతోపాటు అంటురోగాలు ప్రబలుతాయని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. డ్రెయినేజీ మరమ్మతులు చేయించి మురుగునీరు రహదారిపైకి రాకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యను ప్రజాశక్తి పంచాయతీ ఇన్‌ఛార్జి కార్యదర్శి జయరాజు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే మరమ్మతులు చేయించి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.










