Mar 14,2023 18:49

ప్రజాశక్తి - మొగల్తూరు
పాడి పశువులతో రైతులు ఆర్థికంగా నిలబడేందుకు అవకాశం ఉంటుందని పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జవార్‌ హుస్సేన్‌ అన్నారు. మొగల్తూరులోని పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో లేగ దూడల ప్రదర్శన, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన రైతులకు పలు సూచనలు చేశారు. పశువుల ఆరోగ్యం తెలుసుకునేందుకు నరసాపురంలో ల్యాబ్‌ ఏర్పాటు చేశామన్నారు. దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రదర్శనను సర్పంచి పదవుల మేరీ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో రైతులు 24 దూడలను ఉంచారు. ఈ ప్రదర్శనలో అందంగా ఉన్న లేగ దూడలకు బహుమతులు అందించారు. ఈ ప్రదర్శనలో జగన్నాధపురానికి చెందిన సరిపల్లి సుబ్బరాజు సాయి వాల్‌ దూడ ప్రథమ స్థానం, రామన్నపాలెం గ్రామానికి చెందిన అయితం తాన్‌ చంద్‌ పుంగనూరు దూడ ద్వితీయ స్థానం, మొగల్తూరుకు చెందిన రావుల సత్యనారాయణ దూడ తతీయ స్థానంలో నిలిచాయి. అనంతరం బహుమతులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంబిసి ఛైర్మన్‌ పెండ్ర వీరన్న, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధాకర్‌, జిల్లా పశు ఘన అభివృద్ధి అధికారి డాక్టర్‌ జెసూరత్నం, వైద్యులు పాల్గొన్నారు.