Jul 13,2023 08:44

సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి వర్గం సభ్యులు

        అనంతపురం : సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు బుధవారం నుంచి అనంతపురం నగరంలో ప్రారంభమయ్యాయి. మొదటి రోజు బుధవారం నాడు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం నగరంలోని రేడియెంట్‌ ఫంక్షన్‌ హాలులో జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, ఎంఎ.బేబిలు ముఖ్య అతిథలుగా హాజరయ్యారు. నేడు, రేపు రాష్ట్ర కమిటీ సభ్యులందరూ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర కమిటీ నాయకులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు.
నేడు బహిరంగ సభ
అనంతపురం నగరంలోని నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద బహిరంగ సభను సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5-30 గంటలకు జరిగే ఈ సభలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్‌, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావులు ప్రధాన వక్తలుగా హాజరుకానున్నట్టు ఆయన తెలిపారు. ఈ సభకు పెద్దఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.