ప్రజాశక్తి - పెనుమంట్ర : ధాన్యం కొనుగోలు విషయంలో తడిచిన ధాన్యాన్ని తక్కువ ధరకి కొనడానికి కొంత మంది చూస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పొలమూరులో రైతుల పొలాల్లో తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంతెన సీతారాం మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని గొను సంచులు కోరతా లేకుండా చూడాలని, తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన రూ1530 కే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. రైతులను ఆదుకోవాలని రెండు కేజీలు అదనంగా తుయ్యలి అనే విధానం ద్వారా రైతుని మోసం చేస్తున్నారని అన్నారు. రైతులు అన్ని విధాలుగా నష్ట పోతున్నారు. ఒక పక్క పకృతి సహకరించడం లేదని, మరో వైపు ప్రభుత్వం విధానాలు కారణంగా ఎక్కువమంది సన్నా, చిన్నకారు కౌలు రైతులు నష్టపోతున్నారని , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె గోపాలన్, పొలమూరు గ్రామ శాఖ కార్యదర్శి రాపాక ఆశీర్వాదం, చింతపల్లి తిరుమలరావు, రైతులు సారిపల్లి గోపీ, బి శ్రీనివాస్, పి సత్యనారాయణ, రామాంజనేయులు, తదితరి రైతులు పాల్గొన్నారు.










