ప్రజాశక్తి-నగరి : చిత్తూరు జిల్లాలో మండూస్ తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నగరి నియోజకవర్గంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. శనివారం ఉదయం 6 గంటల వరకు అందిన వివరాల ప్రకారం ఈ నియోజకవర్గంలో నగరిలో 181 మిల్లీమీటర్లు వర్షం పడింది. అలాగే విజయపురం మండలంలో 159 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అతి తక్కువగా కుప్పంలో 6.2 mm వర్షపాతం నమోదయింది. భారీగా వీస్తున్న గాలుల వల్ల భారీ వృక్షాలు నేలకొరుగుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో కరెంటు తీగలు తెగిపోతున్నాయి దీంతో అక్కడక్కడ విద్యుత్తుకు అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటివరకు అధికారులు 200 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు వీరంతా లోతట్టు ప్రాంతంలో ఉండడంతో వీరిని సమీపంలోని వసతి గృహాల్లో పాఠశాలలో ఉంచి సదుపాయాలు కల్పిస్తున్నారు.










