ప్రజాశక్తి-గణపవరం : మానవతాసంస్త సమాజసేవలో భాగంగా వేసవిలో బాటసారులకు దాహర్తిని తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేయటం హర్షించ తగ్గవషయమని గణపవరం తాహశీల్దార్ పమ్మిలక్షి అన్నారు. గురువారం స్తానిక మసీదు సెంటర్ వద్ద మానవతా సంస్త ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆమేప్రారంబించారు. ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ మానవతా ఆద్వర్యాన మండలంలో ప్రజలకు అనేక సేవలు అందిస్తుదని చెప్పారు. వేసవిలో బాటసారులకు దాహర్తిని తీర్చడానికి వైఎస్సార్ మండల నాయకులు కాకర్లశ్రీను సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేయటం పట్ల ఆమే హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో మానవత డైరిని ఆవిష్కరించారు. ఇంకా మానవత మండల అద్యక్షలు వంకాయల రామారావు, జిల్లా కన్వీనర్ కాకర్ల వినాయక, నాయకులు ఆర్.వి.ఎస్.రాజు, గణపవరం సర్పంచి మూల అలంకారం బోడ్డు శ్రీను, ఇంటిఉదయ బాస్కరావు, పాతపాటి హరికుమార్, రాజు, పెరుమళ్ళ అంజిబాబు, నంద్యాల రామలింగరాజు పాల్గొన్నారు.










