Jul 11,2022 22:57

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
రెండు నెలల క్రితం భార్య, ఇప్పుడు భర్త - అనాధలైన పిల్లలు
ప్రజాశక్తి- గంగవరం

రెండు నెలల్లోనే ఒకే కుటుంబంలో భార్యాభర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మబ్బోల్లపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఈ గ్రామంలోని శివ (35) టైలరింగ్‌ చేస్తూ జీవనం సాగించేవాడు. రెండు నెలల క్రితం భార్య రేఖ కుటుంబ కలహాలతో ఇంటిలోని ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. తర్వాత తమ ఇద్దరు బిడ్డలను శివ మామ గారు కొలమాసనపల్లి పంచాయతీ గుండ్లపల్లి గ్రామానికి తీసుకెళ్లి చూసుకుంటున్నారు. ఆదివారం శివ తమ పిల్లలను చూడడానికి గుండ్లపల్లి చేరుకోగా అత్తమామలు తన పిల్లలను చూపించకపోవడంతో స్వగ్రామమైన మొగోల్లపేటకి చేరుకొని జీవితంపై విరక్తి చెంది తన ఇంటిలో భార్య ఉరివేసుకున్న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మతి చెందినట్లు గ్రామస్తులు తెలియజేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదుచేయగా గంగవరం పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని శవాన్ని పంచనామా నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్‌ రెడ్డి తెలియజేశారు.