ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : మండలంలోని రాజాభావి కనుం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. (మీ సేవ) భూపతి రెడ్డి (46) బుధవారం రాత్రి సొంత గ్రామమైన పచ్చికాపల్లం నుంచి తిరుపతికి కారులో వెళ్లాడు. ఈ క్రమంలో రాజ బావి కనుమ సమీపంలో ఎదురుగా వస్తున్న కారును ఢకొీనడంతో భూపతి రెడ్డి నడుపుతున్న కారు పక్కన ఉన్న కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అతను అక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఉంది. భూపతి రెడ్డి అందరికీ పరిచయిస్తుడు, గతంలో మీ సేవ, ప్రస్తుతం నెట్ సెంటర్‌ను నడుపుతున్నాడు. భూపతిరెడ్డి మృతి చెందడంతో ఇటు సొంత గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న వెదురు కుప్పం పోలీసులు ప్రమాద వివరాలను తెలుసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.










