Jul 25,2023 21:34

మంత్రి ఫొటోకు పసుపు పూసి పూలు, చీర పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన వీరమహిళలు

        ప్రజాశక్తి-అనంతపురం   జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి జోగి రమేష్‌ ఓ కొజ్జా అని చిత్రపటానికి పసుపు రాసి చీర, గాజులు పెట్టి మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నగర కార్యదర్శి సువర్ణ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, విధివిధానాలపై ప్రశ్నించిన పవన్‌కల్యాణ్‌పై మంత్రి జోగి రమేష్‌ అనుచితంగా మాట్లాడటం బాధాకరమన్నారు. ఈ వ్యాఖ్యలు చేస్తుంటే సిఎం జగన్‌ చిరునవ్వులు చిందించడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రి వెంటనే పవన్‌కల్యాణ్‌కు క్షమాపణ చెప్పాలని, లేకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.