మంత్రి పెద్దిరెడ్డిని కలిసిన టీడీపీ నాయకులు రామచంద్రారెడ్డి
ప్రజాశక్తి-రొంపిచెర్ల: రాష్ట్ర అటవీ, విద్యుత్, భూగర్భ గనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రొంపిచెర్ల మండల టీడీపీ సీనియర్ నాయకులు గుండ్లూరు రామచంద్రారెడ్డి శుక్రవారం కలిశారు. టీడీపీ నాయకులు గుండ్లూరు రామచంద్రారెడ్డి గతంలో రెండు సార్లు టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీడీపీ పార్టీలో డబ్బు ఎంత ఖర్చు చేసినా గుర్తింపు లేదని దూరంగా ఉన్నట్లు తెలిసింది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గుండ్లూరు రామచంద్రారెడ్డి టీడీపీకి దూరంగా ఉన్నారు. పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి చల్లా రామచంద్రా రెడ్డి సొంత గ్రామం బొమ్మయ్య గారి పల్లి చెందిన గుండ్లూరు రామచంద్రారెడ్డి తన అనుచరులతో కలిసి భారీ ఎత్తున వైసిపిలోకి చేరేం దుకు ప్రయత్నాలు చేస్తు న్నట్లు సమాచారం. త్వరలోనే మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో వైసిపిలో చేరను న్నారు. బొమ్మయ్యగారి పల్లిలోనే టీడీపీ నాయకులు వైసిపిలోకి చేరు తుండడంతో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందు తున్నారు. ఎన్నికల సమీపించే కొద్ది చేరికల పర్వం ఎక్కువ గా కొనసాగుతోందని అందరూ భావిస్తున్నారు.










