మంగళం విద్యావాణి సంచికను ఆవిష్కరిస్తున్న జేసీ
ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్: 'మంగళ విద్యావాణి' 19వ సంచికను జాయింట్ కలెక్టర్ శ్రీదర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చిత్రలేఖనం, ఆర్టికల్స్ ఎంతో ఉపయోగపడేలా ఉన్నట్లు చెప్పారు. మంచి పుస్తకాన్ని విద్యార్థులకు అందించిన ఉధ్యాపక బృందాన్ని అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లలిత మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో విద్యార్థులతో నిర్వహించే మాసపత్రిక మంగళవిద్యావాణి 19వసంచిక విడుదల చేయడం రాష్ట్రంలో గుర్తింపు తెచ్చిందన్నారు. మాసపత్రిక సంపాదకులు అరుణ్ మాట్లాడుతూ సైన్సుకు సంబం ధించిన అంశాలను పొందుపర్చడం జరిగిందన్నారు. మాసపత్రిక ఆవిష్కరణలో పిళ్ళారప్ప, రమాదేవి, ప్రేమకృష్ణమోహన్, భారతి, చిట్టిబాబు, సంజీవి, కవిత, ధనశేఖర్‌పాల్గొన్నారు.










